ప్రమాదాల శాతం పెరిగింది | fire accidents increased | Sakshi
Sakshi News home page

ప్రమాదాల శాతం పెరిగింది

May 4 2014 2:13 AM | Updated on Sep 13 2018 5:11 PM

జిల్లాలో అగ్ని ప్రమాదాల శాతం పెరిగిందని జిల్లా అగ్నిమాపకదళ అధికారి జయప్రకాశ్ అన్నారు. శని వారం ఉదయం సాలూరు వచ్చిన ఆయన

సాలూరు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో అగ్ని ప్రమాదాల శాతం పెరిగిందని జిల్లా అగ్నిమాపకదళ అధికారి జయప్రకాశ్ అన్నారు. శని వారం ఉదయం సాలూరు వచ్చిన ఆయన స్థానిక పైర్ స్టేషన్‌ను సందర్శించి ఫైళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది అగ్నిప్రమాదాలు ఎక్కువయ్యాయన్నారు. అయితే తన పరిధిలో గల 10 స్టేషన్‌లలోని సిబ్బంది పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. అలాగే వాహనాల కండిషన్ బాగుం దని, కొన్ని స్టేషన్‌లకు కొత్త వాహనాలను సమకూర్చామన్నారు. అలాగే నీటి సమస్య లేకుండా ప్రతి స్టేషన్‌లోను బోరు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో సాలూరు,బొబ్బిలి.పార్వతీపురం, తదిదర పట్టణాలలో అగ్ని ప్రమాదాలు పెరిగాయన్నారు. గత ఏడాది 32 మంది సిబ్బందిని నియమించడం వల్ల సిబ్బంది కొరత లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ అగ్ని మాపకదళ అధికారి కేజేటీ ప్రసాదరావు స్థానిక అధికారి అప్పలరాజులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement