కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం | Farmers commit suicide | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

Oct 12 2015 4:44 PM | Updated on Oct 1 2018 2:09 PM

తన సమస్య పరిష్కారం కోసం కర్నూలు కలెక్టరేట్‌కు వచ్చిన ఓ రైతు అక్కడే ఆత్మహత్యాయత్నం చేశాడు.

తన సమస్య పరిష్కారం కోసం కర్నూలు కలెక్టరేట్‌కు వచ్చిన ఓ రైతు అక్కడే ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే..  రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామానికి చెందిన రైతు బ్రహ్మయ్యకు నాలుగు ఎకరాలకు పైగా భూమి ఉంది.  భూమి వివరాలు.. ఆన్ లైన్ చేసేందుకు చాలా కాలంగా వీఆర్వో చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు.

దీంతో పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విసిగి పోయిన బ్రహ్మయ్య సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ ను కలిసేందుకు వచ్చాడు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందుబాటులోకి రాకపోవడంతో.. డీఆర్వోకు ఫిర్యాదు ఇచ్చాడు. తర్వాత వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు.. ఇది గమనించిన సిబ్బంది బ్రహ్మయ్యను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైతుకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement