కృష్ణా జిల్లా విజయవాడ మైట్రో రైల్ డిపో భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు.
కృష్ణా జిల్లా విజయవాడ మైట్రో రైల్ డిపో భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. అయితే ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారిపోయింది. ప్రజాభిప్రాయ సేకరణలో అసలు విషయాలు బయటకొస్తున్నాయి. అధికారుల తీరును నిడమనురు రైతులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
వాస్తవానికి మార్కెట్లో తమ భూమి ధర ఎకరా రూ.10 కోట్లుండగా, కేవలం 66 లక్షల రూపాయలుగా ఎలా నిర్ధారిస్తారని ఆ ప్రాంతాల రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. రైతులు ఎదురు తిరగడంతో అధికారులకు ఏం చేయాలో తోచడం లేదు. మెట్రో రైల్ డిపోకు తమ భూములు ఇచ్చేది లేదని రైతులు బహిరంగంగానే చెబుతున్నారు.