మదర్‌థెరిసా విద్యార్థినికి బంగారు పతకం | engineering student get gold medal | Sakshi
Sakshi News home page

మదర్‌థెరిసా విద్యార్థినికి బంగారు పతకం

Nov 17 2017 8:11 AM | Updated on Nov 17 2017 8:11 AM

engineering student get gold medal  - Sakshi

రోహిత

గంగవరం: మండలంలోని మదర్‌థెరిసా ఇంజినీరింగ్‌ విద్యార్థిని రోహిత బంగారు పతకం సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్‌ రవీంద్రబాబు తెలిపారు. ఐదు జిల్లాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తమ కళాశాలకు ఈ పతకం రావడం హర్షదాయకమన్నారు. కళాశాలలో 2013– 17 బ్యాచ్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివిన రోహిత 86.01శాతం మార్కులతో జేఎన్‌టీయూ పరిధిలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు.  విద్యార్థినిని కళాశాల యాజమాన్యం రాజేంద్రరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement