11 శాఖల్లో ఉద్యోగుల పంపిణీ పూర్తి | employees distribution completed in 11 departments | Sakshi
Sakshi News home page

11 శాఖల్లో ఉద్యోగుల పంపిణీ పూర్తి

Apr 18 2015 12:50 AM | Updated on Sep 3 2017 12:25 AM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీని కమలనాథన్ కమిటీ 11 శాఖల్లో పూర్తి చేసింది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీని కమలనాథన్ కమిటీ 11 శాఖల్లో పూర్తి చేసింది. 11 శాఖల్లోని ఉద్యోగుల్లో ఏ ఉద్యోగిని ఏ రాష్ట్రానికి పంపిణీ చేశారో వివరిస్తూ ఆదివారం లేదా సోమవారం ఆదేశాలు జారీ చేయనున్నారు. పంపిణీ పూర్తి చేసిన ఉద్యోగులకు అభ్యంతరాలు తెలియజేయడానికి రెండు వారాల గడువు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement