గజరాజుల బీభత్సం | elephants attacks in vizayanagaram district | Sakshi
Sakshi News home page

గజరాజుల బీభత్సం

Apr 9 2015 10:31 AM | Updated on Sep 3 2017 12:05 AM

ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల సంచారం వల్ల గిరిపుత్రులు భయాందోళనకు గురవుతున్నారు.

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల సంచారం వల్ల గిరిపుత్రులు భయాందోళనకు గురవుతున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో కొన్ని రోజులుగా ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులకు అంతులేని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. తాజాగా గురువారం ఉదయం సాలూరు మండలంలోని శికపరువు గ్రామంలో నాలుగు ఏనుగులు సంచరిస్తూ కనిపించాయి. స్థానికులు వాటి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనే బాధల్లో ఉన్నారు. ఎలాగైనా అటవీ అధికారులు కల్పించుకుని వారిని కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement