గ్యాస్ కోసం పడిగాపులు | due to lack of electricity was interrupted by the organizers of the distribution cylinders | Sakshi
Sakshi News home page

గ్యాస్ కోసం పడిగాపులు

Dec 19 2013 4:27 AM | Updated on Sep 2 2017 1:45 AM

స్థానిక జెండాచెట్టు సమీపంలో ఉన్న శ్రీభవాని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద బుధవారం గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు దీరారు.

కావలిఅర్బన్, న్యూస్‌లైన్ : స్థానిక జెండాచెట్టు సమీపంలో ఉన్న శ్రీభవాని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద బుధవారం గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు దీరారు.
 
 గ్యాస్ కోసం వచ్చిన వృద్ధులు, చంటి బిడ్డలను తీసుకు వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.గ్యాస్ సిలిండర్ కోసం ఉదయం ఏజెన్సీ వద్దకు వచ్చిన వినియోగదారులు సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. ఏజెన్సీలో విద్యుత్ లేని కారణంగా కంప్యూటర్లు పని చేయకపోవడంతో సిలిండర్లను పంపిణీకి అంతరాయం ఏర్పడిందని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా జనరేటర్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రారంభమైన సిలిండర్ల పంపిణీ సాయంత్రం వరకు సాగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement