శుక్రవారం ప్రధాని మోదీతో వర్చువల్‌గా జరిగిన సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్ర, జిల్లాల్లోనూ కమిటీల ఏర్పాటు.. నోడల్ ఆఫీసర్ల నియామకం
పీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి తెలిపారు. పశి్చమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని చెప్పారు. 33 జిల్లాల్లోనూ గ్యాస్ సరఫరా, పెట్రోల్, డీజిల్ విక్రయాలు.. బ్లాక్ మార్కెట్ నిరోధానికి కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించినట్టు సీఎం తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో ఆస్పత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పంపుతున్నట్టు సీఎం వెల్లడించారు.
ప్రతి బంక్‌లో స్టాక్ ఎంత ఉంది.. ఎంత వినియోగిస్తున్నారనే దానిపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని సీఎం తెలిపారు. తెలంగాణలో సాధారణ రోజుల్లో రోజుకు 36,189 కిలోలీటర్ల పెట్రోల్, డీజిల్ వినియోగం జరుగుతుందని, ప్రస్తుతం 1,88,210 కిలోలీటర్ల నిల్వలు ఉన్నట్టు సీఎం వివరించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో భయాందోళనలు కలిగేలా పోస్టులు పెడు తున్న వారిపై చట్టపరమైన చర్య తీసుకుంటున్నట్టు తెలిపారు.
శిలాజ ఇంధనాలపై దృష్టి...
తెలంగాణలో శిలాజ ఇంధనాలపై (బొగ్గు, చమురు, గ్యాస్) ఆధార పడడం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని.. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి పెంచుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలో ఈవీలపై వంద శాతం రోడ్డు పన్ను, రిజి్రస్టేషన్ ఫీజు మినహాయించామన్నారు. ఈవీల తయారీ, బ్యాటరీ ఎకో సిస్టమ్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్టు పీఎం మోదీ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంలో 1.20 లక్షలకు పైగా ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను రెట్రో ఫిటింగ్ ద్వారా ఈవీలుగా మార్చే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆరీ్టసీలో ఇక ముందు అన్ని ఈవీ బస్సులనే వినియోగించనున్నట్టు సీఎం రేవంత్ ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి పాల్గొన్నారు.
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్‌రెడ్డి
కేరళ, అసోం, గోవా, పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో కీలకం
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం రేవంత్‌రెడ్డికి జాతీ యస్థాయిలో ప్రాధాన్యం పెరుగుతోంది. ఏఐసీసీ తాజాగా ప్రకటించిన పుదుచ్చేరితోపాటు కేరళ, అసోం, గోవా రాష్ట్రాల స్టార్ క్యాంపెయినర్ల జాబితాల్లో ఆయనకు చోటు దక్కింది. కేరళ, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాం«దీ, ప్రియాంక గాం«దీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతోపాటు రేవంత్‌రెడ్డి ఉన్నారు. పుదుచ్చేరి జాబితాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లకు కూడా చోటు దక్కింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ సమరి్పంచింది.


