‘దూదేకులను బాబు ఓటు బ్యాంకుగానే చూశారు’ | Dudekula JAC Leader Dastagiri Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘దూదేకులను బాబు ఓటు బ్యాంకుగానే చూశారు’

Mar 7 2019 2:34 PM | Updated on Mar 7 2019 2:36 PM

Dudekula JAC Leader Dastagiri Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దూదేకులను ఓటు బ్యాంకుగానే చూశారని, ఐదు ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తామని చెప్పి విస్మరించారని ఏపీ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు. దూదేకులకు చట్ట సభలలో ప్రాధాన్యత కల్పించాలని గురువారం విజయవాడ ధర్నాచౌక్‌లో ఏపీ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 లక్షల దూదేకులకు దామాషా ప్రకారం చట్టసభల్లో  ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. దూదేకుల ఫెడరేషన్‌కు రూ. 500 కోట్లు నిధులు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. తమకు చట్ట సభలలో ప్రాతినిధ్యం కల్పించిన రాజకీయ పార్టీకి పట్టం కడతామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement