రెవెన్యూ ఉద్యోగుల్లో గుబుల్ | dma command the special audit on property tax irregularities | Sakshi
Sakshi News home page

రెవెన్యూ ఉద్యోగుల్లో గుబుల్

Jul 7 2014 12:45 AM | Updated on Sep 2 2017 9:54 AM

ఆస్తి పన్నుల అక్రమాలపై మున్సిపల్ పరిపాలన విభాగం డెరైక్టర్(డీఎంఏ) స్సెషల్ ఆడిట్‌కు ఆదేశించడంతో రెవెన్యూ ఉద్యోగుల గుండెల్లో గుబుల్ పట్టుకుంది.

 ఎమ్మిగనూరు టౌన్:  ఆస్తి పన్నుల అక్రమాలపై మున్సిపల్ పరిపాలన విభాగం డెరైక్టర్(డీఎంఏ) స్సెషల్ ఆడిట్‌కు ఆదేశించడంతో రెవెన్యూ ఉద్యోగుల గుండెల్లో గుబుల్ ప ట్టుకుంది. ఇటీవల నంద్యాల మున్సిపాలిటీలో ఆస్తి పన్ను విధింపులో చోటు చే సుకున్న అక్రమాలు బయటపడటంతో పాటు 11మంది రెవెన్యూ ఉద్యోగులపై వేటు పడిన విషయం విధితమే. దీంతో రాష్ర్టంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తిపన్ను విధింపుపై ఆన్‌లైన్, మాన్యువల్ రికార్డులను ర్యాండమ్ పద్ధతిలో అసిస్‌మెంట్లను పరిశీలించేందుకు స్పెషల్ ఆడిట్ నిర్వహించాలని డీఎంఏ నిర్ణయించారు.

ఈ మేరకు రికార్టులను సిద్ధంగా ఉంచుకొని స్పెషల్ ఆడిట్ బృందానికి సహకరించాలని డీఎంఏ శనివారం రాత్రి మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మిగనూరు మునిపాలిటీలో ఐదేళ్లుగా భవనాలు, దుకాణాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం జోరందుకుంది. 2011లో నిర్వహించిన గృహాల గణన రికార్డుల మేరకు పట్టణంలో వివిధ భవనాలు 19,168 ఉన్నాయి. గణన తరువాత మూడేళ్లలో మరిన్ని భవనాలు వెలిశాయి. ప్రస్తుతం ఈ అసిస్‌మెంట్ల(భవనాలు) ద్వారా ఏడాదికి రూ.1.46కోట్ల ఆదాయం మున్సిపాలిటీకి సమకూరుతోంది. 2001నుంచి 2010వ సంవత్సరం వరకు ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో పాలన గాడి తప్పడంతో రూ.7.30కోట్ల అవినీతి చోటు చేసుకుంది. ఈ కుంభకోణంపై సీబీసీఐడీ అధికారులు రెండేళ్లుగా విచారణను చేపడుతున్నారు.

 ఈ నేపథ్యంలో గతంలో ఆస్తిపన్ను విధింపులోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. కొన్ని అసిస్‌మెంట్లకు ఇప్పటికీ పన్ను విధించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు గతంలో పనిచేసిన బిల్‌కలెక్టర్లు డబ్బుకు కక్కుర్తిపడి ఆస్తిపన్నును తగ్గించి మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొట్టారన్న విమర్శలున్నాయి. ఈ సారి ఆడిట్ అధికారులు నిజాలు ఎంతవరకు నిగ్గుతేలుస్తారో వేసిచూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement