ఎమ్మిగనూరులో టెన్షన్‌.. టెన్షన్‌ | YSRCP Leaders Protest In Yemmiganur Kurnool District | Sakshi
Sakshi News home page

ఎమ్మిగనూరులో టెన్షన్‌.. టెన్షన్‌

Mar 31 2026 12:13 PM | Updated on Mar 31 2026 2:57 PM

YSRCP Leaders Protest In Yemmiganur Kurnool District

సాక్షి, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు చేనేత సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడంపై ఆందోళన చేపట్టారు. కోఆపరేటివ్‌  సొసైటీ ఎదుట చేనేతలు నిరసనకు దిగారు. చేనేత కార్మికులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ, వామపక్ష నేతలు ధర్నాకు దిగారు. సొసైటీని అప్పుల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై చేనేత కార్మికులు, వైఎస్సార్‌సీపీ నేతలు బైఠాయించారు.

ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ, సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విలీనం పేరుతో చేనేతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు నినాదాలు చేశారు. సర్వసభ్య సమావేశంలో విలీన అంశం తొలగించాలంటూ డిమాండ్ చేశారు.

Butta Renuka: ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు.. నీ కుట్రలకు ఎవ్వరూ భయపడరు

Advertisement
 
Advertisement
Advertisement