3 రోజులు.. 86.23 లక్షల కుటుంబాలు | Distribution of free ration goods above 86 lakh people in AP | Sakshi
Sakshi News home page

3 రోజులు.. 86.23 లక్షల కుటుంబాలు

Apr 19 2020 4:23 AM | Updated on Apr 19 2020 4:23 AM

Distribution of free ration goods above 86 lakh people in AP - Sakshi

విజయవాడలో ఇంటి వద్దే రేషన్‌ పంపిణీ చేస్తున్న వలంటీర్లు

సాక్షి, అమరావతి: అధికారులు, రేషన్‌ డీలర్లు, గ్రామ, వార్డు వలంటీర్ల కృషితో మూడు రోజుల్లోనే రాష్ట్రంలో 86.23 లక్షలకు పైగా కుటుంబాలకు ఉచిత రేషన్‌ సరుకులు అందాయి. శనివారం ఒక్క రోజే 33.26 లక్షల మంది కుటుంబాలు సరుకులు తీసుకున్నాయి. ఇప్పటి వరకు 1.26 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం, 8,524 మెట్రిక్‌ టన్నుల శనగల్ని పేదలకు పంపిణీ చేశారు.

రేషన్‌ కార్డుదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉదయం 5  నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పంపిణీ చేశారు. రాష్ట్రంలో 18.67 లక్షల మంది పోర్టబులిటీ ద్వారా సరుకులు తీసుకున్నారు. తెల్లరేషన్‌ కార్డులున్న 1,47,24,017 కుటుంబాలకు సరుకులు అందుబాటులో ఉంచినట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్‌ అఫీషియోకార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement