ఫ్యాక్షనిస్టుల పాత ఆయుధాలు నిర్వీర్యం

Dispose of old weapons Factionists - Sakshi

కర్నూలు: కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో ఫ్యాక్షనిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న 1,575 తుపాకులను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న పోలీస్‌ శిక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్‌ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. 1976 నుంచి 2009 వరకు పలు కేసుల్లో ఎస్‌బీబీఎల్‌ గన్స్‌ 260, ఎస్‌బీఎంఎల్‌ గన్స్‌ 256, బీబీఎల్‌ గన్స్‌ 78, పిస్టల్స్‌ 522, రివాల్వర్లు 364, రైఫిల్స్‌ 93, స్టెన్‌ గన్స్, తపంచ, ఎయిర్‌ గన్స్, ఎయిర్‌ పిస్టల్స్‌.. మొత్తం 1,575 తుపాకులను స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఆయుధాల సీజ్‌ 1998లో ఎక్కువ జరిగిందని వివరించారు. పై అధికారుల అనుమతితో పాత ఆయుధాలను రోడ్డు రోలర్‌తో తొక్కించి పూర్తిగా నాశనం చేశామని, తర్వాత కాల్చి ఇక్కడే గుంతలో పూడ్చి పెట్టినట్లు చెప్పారు. మరో 12 పాత ఆయుధాలను నిర్వీర్యం కమిటీ ఆదేశాల మేరకు ఎగ్జిబిషన్‌ ప్రదర్శన నిమిత్తం ఉంచామన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top