పానకం వల్ల ప్రబలిన అతిసారం | diarrhoea in srisailam | Sakshi
Sakshi News home page

పానకం వల్ల ప్రబలిన అతిసారం

Mar 31 2015 7:38 PM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైలంలో అతిసార వ్యాధి ప్రబలింది. రెండు రోజుల వ్యవధిలో సుమారు 64 మంది బాధితులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, ప్రాజెక్టు వైద్యశాలలో చికిత్స పొందారు.

శ్రీశైలం : శ్రీశైలంలో అతిసార వ్యాధి ప్రబలింది. రెండు రోజుల వ్యవధిలో సుమారు 64 మంది బాధితులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, ప్రాజెక్టు వైద్యశాలలో చికిత్స పొందారు. వివరాల్లోకి వెళ్తే.. మార్చి 28వ తేదీన శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీశైల దేవస్థానం పరిధిలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద పానకం పంపిణీ చేశారు. దాని కారణంగానే అనేక మంది వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల పాలయ్యారని స్థానికులు చెబుతున్నారు.

దేవస్థానం ఆలయ పూజారి యోగేంద్రసాయి, ఆయన భార్య మంజుల సైతం తీవ్ర అస్వస్థతకు లోనై సోమవారం దేవస్థానం వైద్యశాలలో చేరారు. అతిసార వ్యాధికి తోడు  తీవ్రమైన ఆందోళనకు గురికావడంతో మంజుల మృతి చెందారు. ప్రస్తుతం పూజారి కర్నూలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement