తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Devotees Rush Continues in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Aug 11 2013 8:07 AM | Updated on Sep 1 2017 9:47 PM

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా మూడు రోజులపాటు సెలవులు రావటంతో భక్తులు తిరుమల బాట పట్టారు.

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా మూడు రోజులపాటు సెలవులు రావటంతో భక్తులు తిరుమల కొండకకు పోటెత్తారు. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. సర్వదర్శానికి 22 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 8 గంటలు, అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో నడిచి వచ్చిన వారు స్వామివారిని దర్శించుకునేందుకు12 గంటలు సమయం పడుతోంది.

నిన్న 71,552 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల 17 నుంచి మూడు రోజుల పాటు తిరుమలలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. నేడు  గరుడ పంచమి సందర్భంగా ఈ రాత్రి 7 గంటలకు శ్రీవారు గరుడ వాహనంపై ఊరేగనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement