గోకులపాడు మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా | deputy cm chinarajappa visits gokulapadu blast area | Sakshi
Sakshi News home page

గోకులపాడు మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా

Mar 30 2015 1:24 PM | Updated on Nov 6 2018 4:38 PM

విశాఖ జిల్లా గోకులపాడు బాణాసంచా పేలుడు సంభవించిన సంఘటనా స్థలాన్ని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సోమవారం సందర్శించారు.

విశాఖ : విశాఖ జిల్లా గోకులపాడు బాణాసంచా పేలుడు సంభవించిన సంఘటనా స్థలాన్ని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పన పరిహారం అందచేశారు. అలాగే అనధికారికంగా ఉన్న బాణాసంచా గోడౌన్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాఖల సమన్వయంతో బాణాసంచా గోడౌన్లపై నిఘా తీవ్రతరం చేస్తామని చినరాజప్ప హెచ్చరించారు.

కాగా విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గోకులపాడులోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం సాయంత్రం పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement