విశాఖ మన్యంలో దట్టమైన పొగమంచు | dense fog in the Visakha manyam | Sakshi
Sakshi News home page

విశాఖ మన్యంలో దట్టమైన పొగమంచు

Jan 12 2016 8:15 AM | Updated on Apr 3 2019 9:27 PM

విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు మరోసారి తగ్గుముఖం పడుతున్నాయి.

విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు మరోసారి తగ్గుముఖం పడుతున్నాయి. మూడు రోజులుగా ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, చింతపల్లి, అరకు తదితర ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. లంబసింగిలో సోమవారం రాత్రి 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మోదకొండూరు, చింతపల్లి ప్రాంతాల్లో 8 డిగ్రీలు, పాడేరు, అరకులో ఉష్ణోగ్రత 9 డిగ్రీలుగా ఉంది. ఉదయం పది గంటల వరకూ మంచు కురుస్తూనే ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. పెరిగిన చలి తీవ్రతకు మన్యం వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement