కరోనా: తొలగిన ఢిల్లీ టెన్షన్‌ 

 Delhi Train Srikakulam Passengers Have Coronavirus Negative - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: జిల్లా అధికారులు, ప్రజలకు కరోనా వ్యాధికి సంబంధించి ఢిల్లీ నుంచి ప్రయాణించిన వారి విషయంలో ఉత్కంఠ తొలగిపోయింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ మత ప్రచార సభలో పాల్గొన్న వారికి ఎక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నందున జిల్లా మొత్తం ఆందోళనకు గురైంది. జిల్లా నుంచి ఎవరూ ఆ సభకు హాజరు కానప్పటికీ వారు వచ్చిన రైళ్లలో జిల్లాకు చెందిన సుమారు 76 మంది ప్రయాణించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో జిల్లా అధికారులు ప్రయాణించిన 76 మందిని గుర్తించారు. వీరందరికీ దశల వారీగా పరీక్షలు జరపగా అందరికీ నెగిటివ్‌ రిపోర్టు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

ఆదివారం సా యంత్రానికి 135 మందికి సంబంధించిన నమూనాలు పంపించగా 102 రిపోర్టులు నెగెటివ్‌గా తేలా యి. 33 రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో దాదాపు 15 నమూనాలు ఆదివారం సాయంత్రం పంపించారు. జిల్లా వాసులు ఏప్రిల్‌ 30వ తేదీ వరకు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు, వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదన్న ధీమా వద్దని ఇదే పంథాను కొనసాగించి జిల్లాలో వ్యాధి ప్రవేశించకుండా చూడాలని వారంటున్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు కూడా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వస్తుండటం వల్ల వాటిని కూడా పూర్తిగా కడిగి, ఎండలో ఉంచిన తర్వాతనే వినియోగించాలని సూచిస్తున్నారు. 

మార్కెట్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఇంటి బయటే స్నానం చేసి సబ్బును రెండు సార్లు రాసుకోవాలని చెబుతున్నారు. వ్రస్తాలను కూడా స్నానానికి ముందే తడిపివేయాలని, పసుపు, వేప రాసుకోవడం ద్వారా క్రిమికీటకాలను దూరంగా ఉంచవచ్చని ఆయుర్వేద, ప్రకృతి వైద్య నిపుణులు చెబుతున్నారు. జిల్లాకు చెందిన 350 మందికి పైగా మత్స్యకారులు, ఇతరులు పడవల ద్వారా జిల్లాకు చేరుకున్నారని, వారిపై దృష్టిసారించి పరీక్షలు జరపాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు సమాచారమందింది. వారిని గుర్తించే పనిలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. 

మంగళవారం సాయంత్రం సరికి 350 మందిని గుర్తించి వారికి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి పరీక్షలు జరిపించాలని అధికారులు నిర్ణయించారు. వారం రోజులుగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వివరాలు తెలిస్తే, చుట్టుపక్కల వారు జిల్లాలొ ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు, 104 కు తెలియజేయాలని జిల్లా అధికారులు ప్రజలను కోరుతున్నారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

24-05-2020
May 24, 2020, 17:59 IST
ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ ఓపెనర్‌ తౌఫీక్‌ ఉమర్‌కు కరోనా వైరస్‌ సోకింది. శనివారం రాత్రి ఆయనకు వైరస్‌...
24-05-2020
May 24, 2020, 12:35 IST
పెద్దలకు కోడికూర, చేపలు, పిల్లలకు చిప్స్‌ ఇవ్వలేదనే కోపంతో ఆశా కార్యకర్తపై క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. ...
24-05-2020
May 24, 2020, 12:19 IST
న్యూయార్క్‌ : ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ప్రముఖ దినపత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ కరోనా మృతులకు...
24-05-2020
May 24, 2020, 11:26 IST
లక్నో : కరోనా టెస్ట్‌ చేయించుకోలేదనే కారణంతో ఓ వ్యక్తిని అతని కజిన్స్‌ కొట్టి చంపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌...
24-05-2020
May 24, 2020, 11:04 IST
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా కొంతమంది చెవికెక్కించుకోవడం లేదు. అవగాహనా రాహిత్యమో, ‘మనకేం అవుతుందిలే’ అనే నిర్లక్ష్యమో కానీ ప్రాణం...
24-05-2020
May 24, 2020, 10:52 IST
ఢిల్లీ : కరోనా వైరస్‌ నేపథ్యంలో వలస కూలీలు ఆకలి దారిద్య్రం ఎంత ధీనావస్థలో ఉందనేది ఈ ఫోటో తెలియజేస్తుంది. సొంతూళ్లకు...
24-05-2020
May 24, 2020, 10:44 IST
న్యూఢిల్లీ : ప్రముఖ పల్మనాలజిస్ట్‌, ఢిల్లీ ఎయిమ్స్‌ సీనియర్‌ డాక్టర్‌ జితేంద్రనాథ్‌ పాండే కరోనాతో మృతిచెందారు. కరోనా సోకడంతో తన...
24-05-2020
May 24, 2020, 09:34 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,767 కరోనా కేసులు నమోదు...
24-05-2020
May 24, 2020, 08:24 IST
ముంబై : బాలీవుడ్‌ను కరోనా వైరస్‌ వదలడం లేదు. ఇప్పటికే సింగర్‌ కనికా కపూర్‌, నిర్మాత కరీం మోరాని, ఆయన...
24-05-2020
May 24, 2020, 06:36 IST
సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ను మరికొంతకాలం పొడిగిస్తే.. ప్రజా జీవనం స్తంభించి పేద, మధ్య తరగతి ప్రజలు తమ జీవనోపాధి...
24-05-2020
May 24, 2020, 06:32 IST
వాషింగ్టన్‌: ఈఏడాదికి అమెరికాలో తమ చదువులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు వర్చువల్‌ స్నాతకోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో...
24-05-2020
May 24, 2020, 06:15 IST
ప్రముఖ మలయాళ నటుడు సురేష్‌ గోపి త్వరలోనే ఓ కొత్త మైలు రాయిని అందుకోబోతున్నారు. నటుడిగా 247 సినిమాల వరకూ...
24-05-2020
May 24, 2020, 06:09 IST
‘‘రంగేయడానికి ఒకళ్లు.. జడేయడానికి ఒకళ్లు.. బాగానే ఉంది దర్జా.. హ్హహ్హహ్హ’’.... ‘మహానటి’ సినిమాలోని డైలాగ్‌ ఇది. సావిత్రి పాత్రధారి కీర్తీ...
24-05-2020
May 24, 2020, 05:58 IST
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్‌ స్టోరీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శేఖర్‌ కమ్ముల. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి...
24-05-2020
May 24, 2020, 05:50 IST
బెర్లిన్‌: లాటిన్‌ అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆ దేశాల్లో ప్రభుత్వాల నిర్లక్ష్యమే కేసుల్ని పెంచేస్తోంది. బ్రెజిల్, మెక్సికోలో...
24-05-2020
May 24, 2020, 05:35 IST
రెండు నెలలు దాటిపోయింది ప్రపంచం స్తంభించిపోయి.. సినిమా ఆగిపోయి. పనులు మెల్లిగా మొదలవుతున్నాయి. పరుగులు మెల్లిగా ప్రారంభం కాబోతున్నాయి. సినిమా...
24-05-2020
May 24, 2020, 04:58 IST
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకురానున్న 10 రోజుల్లో 2,600 శ్రామిక్‌...
24-05-2020
May 24, 2020, 04:52 IST
న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి మినహాయింపులు ఇచ్చిన తర్వాత కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. వరుసగా రెండో రోజు...
24-05-2020
May 24, 2020, 04:33 IST
న్యూఢిల్లీ:   ఇండియాలో ఆగస్టు లేదా సెప్టెంబర్‌ కంటే ముందే అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పౌర విమానయాన...
24-05-2020
May 24, 2020, 04:22 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో మరో 47 మంది కోలుకున్నారు. దీంతో కరోనా వైరస్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top