ప్రత్యేక హోదా కోసం సీపీఐ ధర్నా | CPI Leaders Protest In Nellore For AP Special Status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం సీపీఐ ధర్నా

Jul 24 2018 10:30 AM | Updated on Mar 23 2019 9:10 PM

CPI Leaders Protest   In Nellore For AP Special Status - Sakshi

నెల్లూరు రూరల్‌: విభజన హామీలను అమలు చేసి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. గాంధీబొమ్మ సెంటర్‌లో ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. సీపీఐ ఆధ్వర్యంలో అనంతపురంలో ధర్నా చేస్తే పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అరెస్ట్‌ చేసి 14 రోజులు జైల్లో పెట్టిన టీడీపీ సర్కార్‌ ఇప్పుడు హోదా ఉద్యమం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

ఇప్పటికైనా తెలుగు ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని ప్రత్యేక హోదా ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ నగర కార్యదర్శి మునీర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శీనయ్య, నగర సమితి సభ్యులు సిరాజ్, షానవాజ్, అన్వర్, అహ్మద్, అజీజ్, షబ్బీర్, నాసిర్, శీనయ్య, గఫూర్, సర్తాజ్, తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement