రుణమాఫీ చేయకుండానే సంబరాలా ? | CPI Leader K. Ramakrishna takes on Andhra Pradesh CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

రుణమాఫీ చేయకుండానే సంబరాలా ?

Jul 27 2014 2:17 PM | Updated on Aug 13 2018 6:24 PM

ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు రుణమాపీపై మొదటి సంతకం చేస్తానంటూ ప్రకటించిన చంద్రబాబు...

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు రుణమాపీపై మొదటి సంతకం చేస్తానంటూ ప్రకటించిన చంద్రబాబు... ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదని సీపీఐ నాయకుడు రామకృష్ణ ఆరోపించారు. కానీ రుణమాఫీ చేసినట్లు పచ్చ పార్టీ నేతలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం గుంటూరు నగరంలోని కొత్తపేటలో సీపీఐ కార్యాలయంలో రైతు సమస్యలపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు రుణాలు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి... వారికి కూడా రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులకు ఆదేశించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement