చెట్టును ఢీ కొన్న వ్యాన్: దంపతులు మృతి | Couple died in road accident in chittoor district | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీ కొన్న వ్యాన్: దంపతులు మృతి

Mar 23 2014 8:15 AM | Updated on Jul 10 2019 7:55 PM

చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం రామగిరి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం రామగిరి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల నుంచి చెన్నై వెళ్తున్న వ్యాన్ చెట్టును ఢీ కొట్టింది. ఆ ఘటనలో దంపతులు మృతి చెందగా,ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.మరణించిన భార్యభర్తల మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని,పోస్ట్మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement