అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం | Couple attempt to suicide not to tolerate debt problems | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం

Feb 22 2014 1:54 AM | Updated on Mar 28 2018 10:59 AM

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం - Sakshi

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాలలో దా‘రుణం’ చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. భార్య బావిలో దూకి ఆత్మహత్యాయత్నాకి పాల్పడింది.

భర్త మృతి..భార్యను రక్షించిన గ్రామస్తులు
 రంగారెడ్డి జిల్లా పెద్ద ఉమ్మెంతాలలో విషాద ం

 
 పూడూరు, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాలలో దా‘రుణం’ చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. భార్య బావిలో దూకి ఆత్మహత్యాయత్నాకి పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వీరార్జున్‌రెడ్డి(38), లావణ్య(33) దంపతులు. వీరికి ఎకరం పొలం ఉంది. మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. ఈ ఏడాది పత్తిపంట సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆశించిన దిగుబడి రాలేదు.
 
  పెట్టుబడితో పాటు ఇద్దరు కూతుళ్ల వివాహం కోసం వారు  రూ. 2లక్షలకు పైగా అప్పులు చేశారు. పంట ఆశించిన స్థాయిలో పండక పోవడంతో భార్యాభర్తలు తీవ్ర మనస్తాపం చెందారు. దీనికి తోడు ఇటీవల డబ్బులు ఇవ్వాలని రుణదాతలు వేధించసాగారు. ఎప్పటిలాగే శుక్రవారం వీరార్జున్‌రెడ్డి పొలానికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న లావణ్య గ్రామ శివారులోని ఓ చేదు బావిలో దూకింది. స్థానికులు గమనించి ఆమెను రక్షించారు. విషయం చెప్పేందుకు స్థానికులు వీరార్జున్‌రెడ్డి కోసం పొలానికి వెళ్లగా రాకంచర్ల రహదారిలోని ఓ మామిడితోటలోని చెట్టుకు ఓ వ్యక్తి మృతదేహంగా వేలాడుతూ కనిపించాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement