టీడీపీ వల్లే ఎన్నికలు ఆగిపోయాయి: అంబటి | councellor elections cancelled because of TDP, claims Ambati rambabu | Sakshi
Sakshi News home page

టీడీపీ వల్లే ఎన్నికలు ఆగిపోయాయి: అంబటి

Apr 15 2017 5:37 PM | Updated on Aug 10 2018 8:23 PM

ప్రొద్దుటూరులో జరగాల్సిన ఎన్నికల తెలుగుదేశం పార్టీ నాయకుల కారణంగానే ఆగిపోయిందని వైఎస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు.

గుంటూరు: ప్రొద్దుటూరులో జరగాల్సిన ఎన్నికల తెలుగుదేశం పార్టీ నాయకుల కారణంగానే ఆగిపోయిందని వైఎస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ నేతలు వరదరాజుల రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు కౌన్సిలర్లను బెదిరించారని అన్నారు. ఒకరు మినిట్స్‌ బుక్‌ను ఎత్తుకెళ్తే, ఇంకొకరు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారని చెప్పారు. కౌన్సిలర్లు చంద్రబాబు, లోకేష్‌ ఫోన్‌ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఓటమి అంటేనే టీడీపీ నేతలు భయపడుతున్నారని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement