విజయవాడలో కరోనా అనుమానిత కేసు

Coronavirus Suspected Case Registered In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలోని సింగ్ నగర్ లూనా సెంటర్‌ లో కరోనా కలకలం సృష్టించింది. ప్రభుత్వాసుపత్రిలో కరోనా అనుమానిత కేసు నమోదు అయ్యింది.  20 రోజుల క్రితం ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన వ్యక్తి.. గత నాలుగు రోజులుగా జ్వరం, జలుబు,దగ్గుతో బాధపడుతున్నారు. ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడంతో  స్థానికులు మీడియా సహకారంతో అప్రమత్తమయ్యారు. ఆశా వర్కర్లు, పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేయగా ఆ వ్యక్తిని వైద్య పరీక్షలు నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. (తెలుగు రాష్ట్రాల్లో 8 జిల్లాలు లాక్‌డౌన్‌)

కోవిడ్‌ –19 (కరోనా వైరస్‌) నివారణ చర్యలను ఏపీ ప్రభుత్వం ముమ్మరంగా చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలను అనుసరించి ప్రతి జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్స్, టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు అయ్యాయి. ప్రతి ఇంటికీ సర్వే చేయడం, కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ఇంట్లోనే ఐసోలేషన్‌లో పెట్టడం, అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించడం, విదేశాలనుంచి వచ్చిన వారిపై పర్యవేక్షణ, రోజూ వారి ఆరోగ్య వివరాలను నమోదు, వివరాల ప్రకారం వైద్యాధికారులు ఇచ్చిన సూచనలను అమలు చేయడం, అవగాహన కలిగించేలా ప్రచారం నిర్వహించడం అనే కోణాల్లో గ్రామస్థాయి వరకూ యంత్రాంగం ముమ్మరంగా పనిచేస్తోంది. ఈ ప్రక్రియలో వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా 50 ఇళ్లకో వాలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి.  
(‘గోప్యత వద్దు.. కచ్చిత సమాచారం ఇవ్వాల్సిందే’)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top