పసిపిల్లల పొట్టగొడుతున్న కాంట్రాక్టర్లు | contracters are not providing food items to anganvadi centres | Sakshi
Sakshi News home page

పసిపిల్లల పొట్టగొడుతున్న కాంట్రాక్టర్లు

Dec 6 2013 2:35 AM | Updated on Jun 2 2018 8:39 PM

అంగన్‌వాడీలకు పౌష్టికాహారం అందిం చేందుకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ సరకుల పంపిణీలో చేతివాటం ప్రదర్శిస్తు న్నారు . తల్లుల, పసిపిల్లల పొట్టగొడుతున్నా రు

 రాజాపేట, న్యూస్‌లైన్
 అంగన్‌వాడీలకు పౌష్టికాహారం అందిం చేందుకు టెండర్ దక్కించుకున్న  కాంట్రాక్టర్ సరకుల పంపిణీలో చేతివాటం ప్రదర్శిస్తు న్నారు . తల్లుల, పసిపిల్లల పొట్టగొడుతున్నా రు. మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు గురువారం పప్పు పంపిణీ  చేశారు.   అయితే   బస్తా పప్పులో తూకం తక్కువ వచ్చిన  ఈ సంఘటన గురువారం వెలుగు చూసింది. ఆలేరు ఐసీడీఎస్ పరిధి రాజాపేట మండలం బొందుగుల సెక్టారులో 19 అంగన్‌వాడీ  కేంద్రాలు, రాజాపేట సెక్టార్‌లో 23  కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా గర్భిణులు, తల్లులు, బాలింతలు, పసిపిల్లలకు టేక్ హోం రేషన్, అమృతహస్తం ద్వారా పౌష్టికాహారం అందజేస్తారు. తల్లులకు రోజుకు బియ్యం 125 గ్రాములు, నూనె 16 గ్రాములు, పప్పు 30 గ్రాముల చొప్పున, ఆరె నెలల నుంచి 3 ఏళ్ల వయస్సు పిల్లకు నెలకు కేజీ బియ్యం, అరకేజీ పప్పు,  అరకేజీ నూనె చొప్పున పౌష్టికాహారం అందించాలి. ఈ పౌష్టికాహారం అందించే కాం ట్రాక్టర్లు వారి చేతివాటం ప్రదర్శిస్తూ డబ్బులు దండుకుంటున్నారు.
 
 25 కేజీలు ఉండాల్సి ఉండగా..
 ఇష్టారాజ్యంగా వ్యహరిస్తూ ఒక్క బస్తాలో 25 కేజీల పప్పు ఉండాల్సి ఉండగా 16 కేజీల నుంచి 20 కేజీల లోపు మాత్రమే ఉంటుంది. సుమారు  బస్తాలో 9 కేజీల పప్పు తక్కువ తూకంతో సరఫరా చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో రికార్డు లెక్కల్లో మాత్రం బస్తా తూకం 25 కేజీలు ఉన్నట్లు చూపుతున్నారు. ఇదేమిటని ప్రశ్నించే పరిస్థితి లేదని అంగన్‌వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. తల్లులకు, పిల్లలకు పౌష్టికాహారం పంపిణీలో సర్దుబాటు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు మాత్రం పిల్లల పొట్టగొడుతూ పౌష్టికాహారం పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నారని సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
 
 రఘనాథపురంలో..
 రఘునాథ పురంలో గ్రామ సర్పంచ్ రామిండ్ల నరేందర్ ఎదుట తూకం వేశారు. బస్తా తూకం 25 కేజీలకు బదులు 20 కేజీలు మాత్రమే ఉండటంతో స్టాకును తీసుకోకుండా తిరిగి పంపించి వేశారు.
 
 తక్కువగా వచ్చిన విషయం    మా దృష్టికి వచ్చింది
  అంగన్‌వాడీ  కేంద్రాలకు పంపిణీ చేస్తున్న కంది పప్పు బస్తాలల్లో తూకం తక్కువగా వచ్చిన విషయం మా దృ ష్టికి వచ్చింది.  బస్తాలు పంపిణీ సూపర్‌వైజర్ పర్యవేక్షణలో జరగాలి. కానీ వారికి వరసగా మీటింగ్ , ట్రై నింగ్, వీడియో కాన్ఫెరెన్స్‌లు ఉండటంతో వారికి వీలుపడ లేదు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తాం.
 - సీడీపీఓ స్వరూపారాణి,
 ఐసీడీఎస్,ఆలేరు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement