బాబు భూ బకాసురుడయ్యాడు : శైలజానాథ్‌ | congress leader sailajanath slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

బాబు భూ బకాసురుడయ్యాడు : శైలజానాథ్‌

Jul 22 2016 4:12 PM | Updated on Mar 23 2019 9:10 PM

బాబు భూ బకాసురుడయ్యాడు : శైలజానాథ్‌ - Sakshi

బాబు భూ బకాసురుడయ్యాడు : శైలజానాథ్‌

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ నేత శైలజానాథ్ మండిపడ్డారు.

హైదరాబాద్‌: ప్రతిపక్షాలు అన్నీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేయాలని పార్లమెంట్‌లో పోరాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ బకాసురుడిగా వ్యవహరిస్తున్నాడని ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శైలజానాథ్ ఆరోపించారు. రాజకీయ పార్టీలకు రాజధానిలోను , జిల్లా కేంద్రాల్లోనూ భూములను కేటాయించే చట్టానికి బాబు ఇష్టానుసారంగా సవరించడం సరికాదన్నారు. శ్రీకాకుళం, కడప, కాకినాడలో ఇప్పటికే కోట్ల విలువైన భూముల్ని టీడీపీ చేజిక్కించుకోవడం అన్యాయమన్నారు. పార్టీలకు భూములిచ్చే అంశంలో 1987 లోఎన్టీఆర్ తెచ్చిన చట్టాన్నే యధావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement