ఏసీబీ చేతికి చిక్కిన సీటీవో | commersial tax officer caught in acb ride | Sakshi
Sakshi News home page

ఏసీబీ చేతికి చిక్కిన సీటీవో

Feb 5 2015 5:02 PM | Updated on Aug 17 2018 12:56 PM

ఏసీబీ చేతికి చిక్కిన సీటీవో - Sakshi

ఏసీబీ చేతికి చిక్కిన సీటీవో

రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ చిక్కాడు

గుడివాడ: మరో అవినీతి చేప ఏసీబీ చేతికి చిక్కింది.  లంచం తీసుకుంటుండగా ఓ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు దొరికిన ఘటన గురువారం చోటు చేసుకుంది. గుడివాడ సీటీవో వీవీయస్‌ఎల్ ప్రసాదబాబు రూ. 25 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. గుడ్లవల్లెరు మండలం గౌతవరం గ్రామానికి చెందిన నక్క రవికుమార్కి చెందిన మిల్లు సరిగా నడవకపోవడంతో లైసెన్స్‌ రద్దు చేయాలని రెండు నెలల క్రితం ప్రసాదబాబును సంప్రదించాడు.

అందుకు ప్రసాదబాబు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇవ్వలేనని రూ. 25 వేలు తీసుకొవాలని రవికుమార్ కోరాడు. అనంతరం ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. పథకం ప్రకారం వల పన్నిన ఏసీబీ అధికారులు గురువారం రవికుమార్ నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా సీటీవో ప్రసాద బాబును పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement