హైదరాబాద్: లేఅవుట్‌కు సంబంధించి సర్వే నివేదిక ఇచ్చేందుకు రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా ఇద్దరు రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో జరిగిన ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని ఓ లేఅవుట్‌కు సంబంధించి జాయింట్ ఇ¯న్‌స్పెక్షన్ సర్వే నివేదిక ఇచ్చేందుకు రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ బి.సుదర్శన్ రెడ్డి, మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
సర్వే నివేదిక ఇచ్చేందుకు తొలుత రూ.30 లక్షలు డిమాండ్ చేసి, చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకోగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆదేశాల మేరకు సర్వేయర్ రూ.20 లక్షలను స్వీకరిస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్, సర్వేయర్‌ను అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.


