కాల్వలో పడి కళాశాల వాచ్‌మెన్ మృతి | College watchman drowns in canal | Sakshi
Sakshi News home page

కాల్వలో పడి కళాశాల వాచ్‌మెన్ మృతి

Oct 9 2015 6:31 PM | Updated on Apr 3 2019 7:53 PM

ప్రమాదవశాత్తు కాల్వలో పడి బాపట్ల వ్యవసాయ కళాశాల వాచ్‌మెన్ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తెనాలి రూరల్ (గుంటూరు) : ప్రమాదవశాత్తు కాల్వలో పడి బాపట్ల వ్యవసాయ కళాశాల వాచ్‌మెన్ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన పి.శ్రీనివాసరావు(33) బాపట్ల ఏజీ కళాశాలలో వాచ్‌మెన్ గా పని చేస్తున్నాడు. అయితే రెండు రోజుల క్రితం కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు.

అప్పటి నుంచి అతడి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. కాగా శుక్రవారం నిజాంపట్నం కాల్వలో మృతదేహాన్ని గుర్తించారు. మద్యం మత్తులో కాల్వలో పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement