ఆనంద దీపాలు వెలగాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Wishes People On Diwali | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలి: సీఎం జగన్‌

Oct 26 2019 11:32 AM | Updated on Oct 27 2019 9:58 AM

CM YS Jagan Wishes People On Diwali - Sakshi

సాక్షి, అమరావతి : దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని సీఎం జగన్‌ అభిలషించారు.

Advertisement
 
Advertisement
Advertisement