ఆర్థిక వ్యవస్థ మందగమనం..అయినా ఆదాయం

Cm Ys Jagan Review Meeting On Finance And Income Sources Of State - Sakshi

ఆదాయ వనరుల ఆర్జన శాఖలపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ 

ఇది సానుకూలం.. దేవుడు మనతో ఉన్నాడు 

ఆర్టీసీలో ఏసీ బస్సులు పెంచండి 

అటవీ, గనుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోండి 

రంగాల వారీగా ఆదాయాలపై అధికారుల ప్రజెంటేషన్‌

సాక్షి, అమరావతి: ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ ఆదాయాల పరంగా నిలదొక్కుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇది సానుకూలమని, దేవుడు మనతో ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఆదాయ వనరుల ఆర్జన శాఖలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తుండడం వల్ల లైసెన్స్‌ ఫీజు కోల్పోయామని అధికారులు ప్రస్తావించగా, మద్యాన్ని నియంత్రించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.

పెండింగ్‌లో ఉన్న పన్నుల వసూళ్లను రాబట్టుకోవడానికి ఒక విధానాన్ని తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీలో మంచి బస్సులను ప్రవేశపెట్టాలని, ఏసీ బస్సుల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎర్రచందనానికి అదనపు విలువ జోడించడానికి ప్రయతి్నంచాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. ఆదాయాన్ని పెంచుకోవడంపై గనుల శాఖ ప్రయత్నించాలని చెప్పారు. రంగాల వారీగా ఆదాయం గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top