ఆ ఆస్తులపైనా దృష్టి సారించాలి : సీఎం వైఎస్‌ జగన్‌ | CM YS Jagan Directions To Officials Over Agrigold Case | Sakshi
Sakshi News home page

రూ. 1150 కోట్లు పంపిణీ వేగవంతం చేయాలి : సీఎం జగన్‌

Jun 25 2019 3:37 PM | Updated on Jun 25 2019 8:53 PM

CM YS Jagan Directions To Officials Over Agrigold Case - Sakshi

బాధితులు, సీఐడీ అధికారులతో త్వరలోనే సమావేశం అవుతా..

సాక్షి, అమరావతి : అగ్రిగోల్డ్‌ బాధితులకు వెంటనే సహాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం, బాధితులు, సీఐడీ అధికారులతో త్వరలోనే సమావేశం అవుతానని వెల్లడించారు. మంగళవారం రెండో రోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా పలువురు ఉన్నతాధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన 1150 కోట్ల రూపాయలు త్వరితగతిన బాధితులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తుల స్వాధీన ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. అదే విధంగా ఈ కంపెనీకి సంబంధించిన విలువైన ఆస్తులపైనా దృష్టి సారించాలని పేర్కొన్నారు.

కాగా  అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉండేలా సీఎం వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు 1150 కోట్ల రూపాయల కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తొమ్మిది లక్షల మంది బాధితులకు ఒకేసారి న్యాయం జరుగనుందని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. బినామీలుగా అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేసిన వారిని శిక్షించే చిత్తశుద్ధి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి ఉందంటూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement