రైతుల చెవిలో సీఎం పూలు పెడుతున్నారు.. | CM puts flowers in the ear of the farmers .. | Sakshi
Sakshi News home page

రైతుల చెవిలో సీఎం పూలు పెడుతున్నారు..

Oct 8 2014 1:56 AM | Updated on Sep 2 2017 2:29 PM

రైతుల చెవిలో సీఎం పూలు పెడుతున్నారు..

రైతుల చెవిలో సీఎం పూలు పెడుతున్నారు..

కరువుతో కునారిల్లుతున్న జిల్లా రైతాంగాన్ని రైతుల్ని ఆదుకుంటామంటూ సీఎం చంద్రబాబు నాయుుడు రైతుల చెవిలో పూలు పెడుతున్నారని ఉరవకొండ...

ఉరవకొండ:
 కరువుతో కునారిల్లుతున్న జిల్లా రైతాంగాన్ని రైతుల్ని ఆదుకుంటామంటూ సీఎం చంద్రబాబు నాయుుడు రైతుల చెవిలో పూలు పెడుతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వుంగళవారం స్థానిక ఆర్‌టీసీ డిపో ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో ఆయన వూట్లాడారు. సోవువారం జరిగిన సీఎం పర్యటన పై ఎన్నో ఆశలు ఉండేవని, కానీ ఆయన ఉపన్యాసంలో రైతులను ఆదుకునే ఒక్క వూటా మాట్లాడలేదని విమర్శించారు.

 నాలుగేళ్లలోపు రైతుల బ్యాంకు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని సీఎం చెప్పడం బాధాకరమన్నారు. మొత్తానికి ఆయన పర్యటన రైతుల్లో తీవ్ర నిరాశను కలిగించిందన్నారు. ‘బ్యాంకులు మీ దగ్గరకు రాకుండా చేస్తా.. వేలం నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటాన’ని చెప్పిన ఆయన వూటల్ని వినే పరిస్థితిలో బ్యాంకర్లు లేరన్నారు. జిల్లా రైతాంగానికి రూ.వెరుు్య కోట్ల క్రాప్ ఇన్సూరెన్స్ అందాల్సి ఉందని, దీనిపై సీఎం ఎలాంటి ప్రకటనా చేయుక పోవడం దారుణవున్నారు.

 వ్యవసాయు మిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు గొప్పలు చెబుతున్న ‘బాబు’ ఆ రంగ బడ్జెట్ అత్యంత పేలవంగా ప్రవేశ పెట్టారని ఆరోపించారు. సాధికారిక మిషన్లు, గ్రిడ్‌లు, స్మాట్ సిటీ, మోగా సిటీలకు రూ.లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని ప్రశ్నించారు. జిల్లాలో సెప్టెంబర్‌లో 4.80 లక్షల వుందికి పింఛన్లు వచ్చేవని, అక్టోబర్ నెలలో కేవలం 2.86 లక్షల వుందికి వూత్రమే పింఛన్లు ఇచ్చారని, 1.20 లక్షల వుంది లబ్ధిదారులకు కోత పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 16న ధర్నాను జయుప్రదం చేయుండి :
 రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను వెంటనే వూఫీ చేయూలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ‘అనంత’లో తలపెట్టిన ధర్నాకు, రైతులు, వుహిళలు స్వచ్ఛందంగా తరలి వచ్చి జయుప్రదం చేయూలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంపై ఈ నెల 9న జిల్లా పార్టీ కార్యాలయుంలో రాష్ట్ర నాయుకుల ఆధ్వర్యంలో సమీక్షిస్తావున్నారు. సవూవేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ బసవరాజు, విడపనకల్లు జెడ్పీటీసీ సభ్యుడు తిప్పయ్యు, కిసాన్ సెల్ నియోజకవర్గ నాయుకులు అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement