ఆ హక్కులు మావే.. కేరళ ముఖ్యమంత్రి | Kerala CM VD Satheesan Opposes Centre’s Role In School Curriculum Under PM SHRI Scheme, Check Out Details Inside Sakshi
Sakshi News home page

ఆ హక్కులు మావే.. కేరళ ముఖ్యమంత్రి

Jun 17 2026 3:00 PM | Updated on Jun 17 2026 3:49 PM

centre wont be allowed to interfere in school curriculum kerala cm

తిరువనంతపురం: కేరళ సీఎం వీడీ సతీషన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలకు సంబంధించిన సిలబస్‌ రూపకల్పణలో పూర్తి హక్కులు రాష్ట్రాలకే ఉంటాయన్నారు. ఈ అంశంలో కేంద్రానికి ఎటువంటి జోక్యం ఉండకూడదన్నారు. పీఎం శ్రీపథకంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు

కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం శ్రీ స్కూళ్ల పథకంపై కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌ ప్రత్యేక కేబినేట్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆయన మాట్లాడుతూ" పాఠశాలల పాఠ్యప్రణాళికను నిర్ణయించే రాష్ట్రాల స్వేచ్ఛలో కేంద్రం జోక్యం చేసుకోవడానికి అనుమతించబోము, పాఠశాలల సిలబస్‌ను నిర్ణయించే రాష్ట్రాల హక్కుల్లో కేంద్రం జోక్యం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు" అని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం  పీఎం శ్రీ ఒప్పందంపై సంతకం చేసి, కేంద్రం నుంచి రూ. 99 కోట్ల నిధులను సైతం స్వీకరించిందని అందుకోసమే ఈ పథకంలో కొనసాగుతున్నామని తెలిపారు.

పీఎంశ్రీ

పీఎం శ్రీ అనేది దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి, ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక కేంద్ర ప్రాయోజిత పథకం. అయితే ఈ పథకం వల్ల జాతీయ విద్యా విధానం అమలుపై వ్యతిరేకత దక్షిణాదిన పలు రాష్ట్రాల్లో వ్యతిరేకత ఎదురవుతోంది. 

హిందీని బలవంతంగా బలవంతంగా రుద్దుతోందని తమిళనాడు, కేరళ లాంటి పలు రాష్ట్రాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీని ద్వారా మాతృభాషకు ప్రమాదం ఏర్పడే అవకాశం  ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి మరోసారి ఈ అంశంపై చర్చ లేవనెత్తారు. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement