ఈ నెల 20న సీఎం చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనలో భాగంగా యలమంచిలిలో సభ ఏర్పాటుకు అధికారులు సిద్ధపడుతున్నారు.
డిగ్రీ కళాశాల మైదానాన్నిపరిశీలించిన జిల్లా అధికారులు
యలమంచిలి : ఈ నెల 20న సీఎం చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనలో భాగంగా యలమంచిలిలో సభ ఏర్పాటుకు అధికారులు సిద్ధపడుతున్నారు. జెడ్పీ సీఈవో మహేశ్వరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ సోమవారం యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఎంపీడీవో ఇ.సందీప్, మున్సిపల్ కమిషనర్ సత్తారు శ్రీనివాసరావులకు సీఎం సభకు అవసరమైన ఏర్పాట్లకు సిద్ధపడాలని సూచించారు.
ముఖ్యంగా రోడ్లు, శానిటేషన్ పరిస్థితులు మెరుగుపరచాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కాలేదని, ఎక్కడెక్కడ సభలు ఏర్పాటు చేయాలనే విషయమై ప్రాథమిక పరిశీలన చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సీఎం పర్యటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని డీఆర్‌డీఏ పీడీ తెలిపారు.