'కిరణ్, చంద్రబాబులు ఇద్దరూ దొంగలే' | CM Kiran kumar reddy, TDP president candrababu both are thieves, says Bhumana Karunakar Reddy | Sakshi
Sakshi News home page

'కిరణ్, చంద్రబాబులు ఇద్దరూ దొంగలే'

Sep 29 2013 11:33 AM | Updated on Jul 29 2019 5:31 PM

సీఎం కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరూ దొంగలే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరూ దొంగలే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో ఆదివారం సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొని ప్రసంగింస్తూ...  సీఎం కిరణ్ సమైక్యవాది అయితే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పదవులకు రాజీనామా చేయకుండా తిరుగుతున్న సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులను అడ్డుకుని బుద్ది చెప్పాలని భూమన కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement