అధికారుల తీరుపై చంద్రబాబు ఫైర్ | CM Chandrababu naidu takes on Government officials | Sakshi
Sakshi News home page

అధికారుల తీరుపై చంద్రబాబు ఫైర్

Oct 18 2014 9:50 AM | Updated on Aug 18 2018 8:05 PM

అధికారుల తీరుపై చంద్రబాబు ఫైర్ - Sakshi

అధికారుల తీరుపై చంద్రబాబు ఫైర్

హుదూద్ తుపాను సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వ అధికారులు అనుసరిస్తున్న అలసత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం: హుదూద్ తుపాను సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వ అధికారులు అనుసరిస్తున్న అలసత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విశాఖలో సహాయక చర్యలపై చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాను బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ అంతంత మాత్రంగా జరుగుతుందని... పూర్తి స్థాయిలో రేషన్ పంపిణీ జరిగే విధంగా చూడాలని చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.

కూలీలు, వాహనాల కొరత తీవ్రంగా ఉందని... ఈ నేపథ్యంలో రేషన్ పంపిణీ పూర్తి స్థాయిలో జరగాలంటే మరో 10 రోజులు పడుతుందని బాబుకు ఉన్నతాధికారులు బదులిచ్చారు. దీంతో అసంతృప్తి చెందిన బాబు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement