
కేంద్రం చేపట్టే ప్రాజెక్టులు పూర్తికావు
కేంద్ర ప్రభుత్వం చేతిలో ప్రాజెక్టుల నిర్మాణం ఉంటే ఆ ప్రాజెక్టులు పూర్తికావని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వకూడదని కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ అడ్డుపడుతున్నాయి. దీనికి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’’ అని చంద్రబాబు అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నపుడు వెంకయ్యనాయుడు రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, ఆయన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో రాష్ట్రానికి కొంత నష్టం ఉంటుందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రపతి కోవింద్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చిన సందర్భంగా చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఏపీలో అసెంబ్లీ సీట్లు పెంచాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు.