ఒక్క పరిశ్రమనూ తేలేని దద్దమ్మ బాబు | CM Babu waste: MLA Roja | Sakshi
Sakshi News home page

ఒక్క పరిశ్రమనూ తేలేని దద్దమ్మ బాబు

Jan 5 2018 3:05 PM | Updated on Oct 29 2018 8:10 PM

CM Babu waste: MLA Roja - Sakshi

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో పుట్టి ఈ జిల్లాకు ఒక్క పరిశ్రమ తేలేని దద్దమ్మ చంద్రబాబు అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. సొంత జిల్లాను పట్టించుకోని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మోసపూరిత పాలన జరుగుతోందని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని, ప్రత్యేక హోదా తీసుకురాలేక కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో తప్పించుకునేందుకు ఏపీని బాబు తాకట్టు పెట్టాడన్నారు. రాష్ట్రంలో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలీని పప్పుకి మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు.

సోది సోమిరెడ్డి, కలెక్షన్ కింగ్ నారాయణలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.. దొడ్డిదారిలో మంత్రులైన వీరు పార్టీకి పెట్టిన పెట్టుబడులను ప్రజల నుంచి తిరిగి దోచుకుంటున్నారని ఆరోపించారు. నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు దారుణమని, వీరిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు అమ్ముడుపోతున్నారని అన్నారు. క్షుద్రపూజలు చేసి మళ్ళీ గెలవాలని చూస్తే ప్రజలు ఒప్పుకోరని చంద్రబాబును రోజా హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement