సంతకవిటి మండలంపై రోగాలు దాడి చేశాయి. కృష్ణంవలసలో విషజ్వరాలు ప్రబలగా, పోతు
రాజుపేటలో డయేరియా విజృంభించింది. దీంతో పలువురు మంచం పట్టారు.
సంతకవిటి : కృష్ణంవలస గ్రామంలో విష జ్వరాలు ప్రబలాయి. జ్వరాలు విజృంభించి వారం కావస్తున్నా తగ్గుముఖం పట్టకపోవడం, వైద్యశిబిరాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వంజరాపు సుహాసిని, చిన్నప్పమ్మ, ఎస్.దుర్గమ్మ, రామకృష్ణ, వంకల దాలమ్మ, పాలిన వెంకమ్మ, పాపారావు, వంకల పాపమ్మ, వంకల సాయి, పిన్నింటి సూరమ్మ, లక్ష్మి, రాము, అంజలి, అసిరమ్మ తదితరులు జ్వరంతో విలవిల్లాడుతున్నారు. వీరిలో కొంతమంది రాజాం, శ్రీకాకుళం వెళ్లి చికిత్స పొందుతున్నారు. కళ్లు ఎర్రగా మారడం, కాళ్లు.. చేతులు పీకడంతో పాటు తలనొప్పి అధికంగా ఉంటుందని జ్వరపీడితులు చెబుతున్నారు. రోజురోజుకూ జ్వర పీడితులు పెరుగుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో గ్రామస్తుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు మంచం పడుతున్నారు. స్థానికంగా వైద్యం అందకపోవడంతో కొంతమంది ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తుండగా, ఆర్థికంగా ఉన్నవారు రాజాం, శ్రీకాకుళం ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. కాగా గ్రామ రహదారి పూర్తగా పాడవ్వడంతో 108 వాహనం కూడా రాలేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోతురాజుపేటలో డయేరియా
పోతురాజుపేట గ్రామంలో డయేరియా ప్రబలింది. టంకాల మహేశ్వరరావు, పోతురాజు యోగీశ్వరరావు, వేణునాయుడు, తవిటినాయుడు, కెల్ల అప్పలనాయుడు, డి.ల క్ష్మిలతో పాటు వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు.
వీరిలో పోతురాజు, తవిటినాయుడు, కెల్ల అప్పలనాయుడుల పరిస్థితి విషమంగా ఉండడంతో మంగళవారం సాయంత్రం కుటుంబీకులు వీరిని ప్రైవేట్ వాహనంలో శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. వైద్య సిబ్బంది స్పందించకపోవడంతో ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని కృష్ణంవలస, పోతురాజుపాలెం గ్రామస్తులు కోరుతున్నారు.
రోగాల పంజా!
Published Wed, Aug 5 2015 1:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్‌లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్‌ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement