ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని ప్రభాకర్‌! | Chintamaneni Prabhakar Still Absconding | Sakshi
Sakshi News home page

ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని ప్రభాకర్‌!

Sep 5 2019 12:11 PM | Updated on Sep 6 2019 8:44 AM

Chintamaneni Prabhakar Still Absconding - Sakshi

సాక్షి, ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. గత ఆరు రోజులుగా చింతమనేని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చింతమనేనిని అదుపులోకి తీసుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన పోలీసులు.. ఆయన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏలూరు కోర్టులో చింతమనేని లొంగిపోతాడని ప్రచారం జరుగుతుండటంతో కోర్టు చుట్టూ మఫ్టీలో పోలీసులు మోహరించారు. ఇప్పటికే దుగ్గిరాలలోని చింతమనేని ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు.

కేసు పెట్టిన యువకులకు బెదిరింపు
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు పెట్టిన యువకుడికి బెదిరింపులు వస్తున్నాయి. చింతమనేనిపై కేసును విత్‌డ్రా చేసుకోవాలని, లేకుంటే నీ అంతుచూస్తామని జోసఫ్‌ను చింతమనేని ప్రభాకర్ అనుచరుల బెదిరించారు. చింతమనేనిపై జోసెఫ్‌ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జోసెఫ్‌ ఏలూరు డిఎస్పీకి తనకు వస్తున్న బెదిరింపులపై ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement