సీఎం పర్యటన రోజంతా... గ్రామంలోనే | Chandrababu Naidu In Jonnagiri Today | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన రోజంతా... గ్రామంలోనే

Jun 3 2018 8:47 AM | Updated on Oct 20 2018 4:47 PM

Chandrababu Naidu  In Jonnagiri Today - Sakshi

ముఖ్యమంత్రి చంద్రబాబు

కర్నూలు(అగ్రికల్చర్‌) : నవనిర్మాణ దీక్షల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో పర్యటించనున్నారు. రోజంతా  గ్రామంలోనే గడపనున్నారు. సీఎం పర్యటన కోసం జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎప్పుడూ కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో జిల్లాకు వచ్చే ముఖ్యమంత్రి ఈ సారి మాత్రం పుట్టపర్తి నుంచి జొన్నగిరికి రానుండడం గమనార్హం. ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకునే ముఖ్యమంత్రి..అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా ఉదయం 10.30 గంటలకు జొన్నగిరి గ్రామానికి వస్తారు. ఎస్సీ, బీసీ కాలనీల్లో  పర్యటిస్తారు.

గ్రామసభ నిర్వహిస్తారు. నీరు–చెట్టు, ఉపాధి పనులను తనిఖీ చేయడంతో పాటు రైతులు, కూలీలతో ముఖాముఖి అవుతారు. రాష్ట్రంలో 5 లక్షల ఫాంపాండ్స్‌  పూర్తి చేసిన సందర్భంగా జొన్నగిరి చెరువు వద్ద నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. తాగునీటి పథకం పనులకు శంకుస్థాపన చేస్తారు. ఫొటో ప్రదర్శన తిలకిస్తారు. నవనిర్మాణదీక్షలో భాగంగా జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 5.15 గంటలకు గ్రామం నుంచి తిరిగి వెళతారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement