ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింలపై కక్ష పెంచుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నేత చాంద్ బాషా విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింలపై కక్ష పెంచుకున్నారని, ఆయన కంటే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెయ్యిరెట్లు నయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నేత చాంద్ బాషా విమర్శించారు.
జనాభాలో ఎనిమిది శాతం వరకు ఉన్న ముస్లింల కోసం చంద్రబాబు ఏమీ చేయడంలేదని, రంజాన్ మాసం అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంపై కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేస్తానని ఆయన అన్నారు. వాగ్దానాలు అమలు చేయని ప్రభుత్వాన్ని దించేయాలని ఆ వ్యాజ్యంలో కోరుతానని చాంద్ బాషా చెప్పారు.