ఎండాడలో ఏపీటీపీసీ స్థలం ‘బీవోటీ’లో ప్రైవేటు సంస్థకు..
0.52 ఎకరాల్లో వాణిజ్య సముదాయాల నిర్మాణం
33 ఏళ్లకు లీజు విధానంలో అప్పగించేందుకు నిర్ణయం
బిడ్లను ఆహ్వనించిన ఏపీటీపీసీ
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తామంటూ అధికారంలోకి వచి్చన చంద్రబాబు సర్కారు ప్రభుత్వ ఆస్తులను గంపగుత్తగా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తోంది. ఇప్పటికే విశాఖలో విలువైన భూములను లులు, సత్వా, కపిల్ చిట్స్ వంటి సంస్థలకు కేటాయించిన ప్రభుత్వం.. తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చిరునామాగా మారిన ఎండాడలోని భూమిని ప్రైవేటు సంస్థలకు అప్పగించేస్తోంది. ఎండాడ సర్వే నంబర్–1లో ఉన్న ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీటీపీసీ)కు చెందిన భూమిని హోటళ్లు, వాణిజ్య సముదాయాల నిర్మాణం పేరిట ప్రైవేటు సంస్థలకు ఇచ్చేస్తోంది.
సుమారు 2,500 చదరపు గజాల విస్తీర్ణంలో జీ+5 నుంచి జీ+10 అంతస్తులు ఉండే విధంగా హోటళ్లు, వాణిజ్య సముదాయాలు నిర్మించి నిర్వహించుకోవడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీటీపీసీ బిడ్లను ఆహ్వనించింది. 33 ఏళ్ల కాలానికి లీజు విధానంలో బిల్డ్, ఆపరేట్, ట్రాన్సఫర్ (బీవోటీ) విధానంలో నిరి్మంచడానికి ప్రైవేటు సంస్థలను ఆహ్వనించింది. కాలపరిమితి తీరిన తర్వాత ఏపీటీపీసీ సమ్మతి మేరకు లీజును పొడిగిస్తామని టెండరు నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంది. ఆసక్తిగల సంస్థలు ఈ నెల 19లోగా బిడ్లు దాఖలు చేయాలని సూచించింది.
కారుచౌక బేరం
ప్రస్తుతం ఎండాడ ప్రాంతంలో వాణిజ్య భవనాల అద్దె చదరపు అడుగు రూ.40పైనే పలుకుతోంది. ఇప్పుడు ఏపీటీపీసీ అభివృద్ధి చేస్తున్న 2,500 చదరపు గజాలు అంటే 22,500 అడుగుల విస్తీర్ణానికి తక్కువలో తక్కువ ఎంత కాదన్నా నెలకు రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అద్దె లభిస్తుంది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ఈ భూమికి కనీస అద్దెను రూ.4 లక్షలుగా నిర్ణయించింది. రూ.4 లక్షలకుపైన ఎవరు ఎక్కువకు కోట్‌చేస్తే వారికి ఈ స్థలాన్ని అప్పగిస్తారు.
నిర్దేశించిన ధర కంటే ఎక్కువ కోట్‌చేసిన మొత్తంపై ఏడాదికి 3 శాతం రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అభివృద్ధి చేసిన స్థలంలో 10 శాతం ఏపీటీపీసీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి ఇవ్వాలని, రెండు నుంచి నాలుగు కార్లకు పార్కింగ్ సదుపాయం కలి్పంచాలని టెండర్ నిబంధనల్లో పేర్కొన్నారు. రూ.15 కోట్ల కనీస నెట్‌వర్త్ కలిగి, గత మూడేళ్లుగా ఏడాదికి కనీసం రూ.7 కోట్లపైన వ్యాపారం చేస్తున్న సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొనడానికి అర్హతగా నిర్ణయించారు.


