చంద్రబాబుది..విజ్ఞప్తా? బెదిరింపా?

Chandrababu Naidu Argument On AP CEO Gopal Krishna Dwivedi! - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వైఖరిని మరోసారి బయట పెట్టుకున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వినతిపత్రం సమర్పిస్తూనే...మరోవైపు ఎన్నికల సంఘంపై అక్కసు వెళ్లగక్కారు. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారంటూ దురుసుగా ప్రవర్తించారు.  కేంద్ర ఎన్నికల సంఘం  నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామంటూ చంద్రబాబు నాయుడు బుధవారం  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అయితే ద్వివేదితో మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు... తీవ్ర స్వరంతో  బెదిరింపు ధోరణిలో వాదనకు దిగారు. అధికారంలో ఉంటే ఏమైనా చేయవచ్చనే ధోరణిని నరనరానా జీర్ణించుకున్న చంద్రబాబు...పోలింగ్‌ మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నా తన అధికార దర్పాన్ని ఏమాత్రం వదలలేదు. 

చదవండి...(పోలింగ్‌కు ముందురోజు.. బాబు ‘భారీ’ డ్రామా)
చంద్రబాబు ఆరోపణలపై ఈసీ వివరణ

వీడియోలో....చంద్రబాబు : ‘ఈజ్‌ వెరిఫయింగ్ ది ఫ్యాక్ట్స్‌ అండి‌.. ఐ యామ్‌ ఆస్కింగ్‌.. యు హావ్‌ టు వెరిఫై.. అదర్‌వైజ్ వుయ్‌ విల్‌ వెరిఫై‌. లెట్‌ దెమ్‌ వెరిఫై.. దెన్‌ ఐ విల్‌ ఫైట్‌ ఇన్‌ ఢిల్లీ.. దెన్‌ ఎందుకు మీ ఆఫీస్‌ ఎందుకు ఇంకా.. క్లోజ్‌ చేయండి.. హు ఈజ్‌ ఎలక్షన్‌ కమిషన్‌.. నేను అడుగుతున్నా.. సరిగా కండక్ట్‌ చేయలేకపోతే.. మిషన్లు పెట్టుకుని రిగ్గింగ్‌ చేసుకోండి మీరు. అయిపోతుంది దేశంలో ఎలక్షన్లు. మేమంతా ఇంట్లో పడుకుంటాం.. ఎందుకు నేను కష్టపడాలి.. ఎందుకు ఈ మీటింగ్‌లు మాకు.. ఏం అవసరం లేదు..మేం అడిగేదేంటి.. మీరు ఇండిపెండెంట్‌ అథార్టీ అవునా? కాదా? ఢిల్లీ చెప్పినట్టు మీరు యాజ్‌ ఇట్‌ ఈజ్‌ ఎందుకు ఫాలో కావాలి.
ద్వివేది : హైకోర్టు.. అలాంటిది లేదు..
చంద్రబాబు : లేకపోయినా.. నేను ఏమంటానంటే.. మీ కాన్షియస్‌ ఒకటి ఉంది కదా.. ఐ యామ్‌ ఆస్కింగ్‌..  యు ఆర్‌ నాట్‌ ఏ పోస్ట్‌ ఆఫీస్‌.. యు ఆర్‌ హావింగ్‌ పవర్‌.. ఏమైనా ఉంటే అబాలిష్‌ చేసేయమనండి.. వాళ్లని.. మిమ్మల్ని అందిర్నీ తీసేయమనండి.. ఆయన్నే ఓ క్లర్క్‌ను పెట్టుకోమని చేయమనండి మేం చూస్తాం.. రేపు ఎలక్షన్‌ కమిషన్‌ ఏంటో.. ఇవన్నీ నేను చెబుతున్నా..అంత ఈజీగా వదిలిపెట్టను నేను టేకప్‌ చేశానంటే లాజికల్‌గా పోవాల్సిందే.’

కాగా ఏపీ సీఈవో ద్వివేదితో భేటీ సమయంలో చంద్రబాబు వేలు చూపిస్తూ మాట్లాడుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top