హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు | Chandra babu returns hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

Sep 12 2013 11:18 AM | Updated on Aug 10 2018 7:58 PM

హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు - Sakshi

హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తొలివిడత ఆత్మగౌరవ యాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు.

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తొలివిడత ఆత్మగౌరవ యాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చేపట్టిన మొదటి విడత ఆత్మగౌరవ యాత్ర బుధవారం రాత్రితో ముగిసింది.

చంద్రబాబునాయుడు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గుంటూరు జిల్లాలో  ఆత్మగౌరవ యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత రెండో విడత ఆత్మగౌరవ యాత్ర షెడ్యూల్‌ను చంద్రబాబు ప్రకటించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి రెండో విడత యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement