విశాఖలో చైన్ స్నాచర్ అరెస్ట్ | chain snatcher arrested in vishaka | Sakshi
Sakshi News home page

విశాఖలో చైన్ స్నాచర్ అరెస్ట్

Nov 23 2015 1:18 PM | Updated on Sep 19 2019 2:50 PM

వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అల్లీపురం: వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన మహేశ్వర్ రావు(45) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఎమ్‌వీపీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement