సీఎం జగన్‌తో కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ భేటీ | Central Minister Giriraj Singh Meets AP CM YS Jagan | Sakshi
Sakshi News home page

ధర్మమే మనకి దారి చూపిస్తుంది: గిరిరాజ్‌ సింగ్‌

Sep 5 2019 10:53 AM | Updated on Sep 5 2019 12:52 PM

Central Minister Giriraj Singh Meets AP CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి : ‘ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనకి దారి చూపిస్తుంద’ని కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అన్నారు. గురువారం గుంటూరు, కృష్ణా జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గిరిరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నంతకాలం ధర్మం కాపాడబడుతుందని, రక్షించబడుతుందని పేర్కొన్నారు. నేటి జిల్లాల పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి మంగళగిరి మండలం ఆత్మకూరులో పర్యటిస్తారు. నీలగిరి ఫౌండేషన్‌ వర్మీ కాంపోస్ట్‌ యూనిట్‌ను సందర్శిస్తారు. పసుపు, మిరప ఆర్గానిక్‌ పంట రైతులతో ఆయన ముచ్చటిస్తారు. అనంతరం పెనమలూరులో పర్యటిస్తారు. 

సీఎం జగన్‌తో కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ భేటీ
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ భేటీ అయ్యారు. గురువారం సీఎం వైఎస్‌ జగన్‌ నివాసానికి వెళ్లిన గిరిరాజ్‌ సింగ్‌ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement