టైర్‌ పేలి స్కూల్‌ బస్సును ఢీకొన్న కారు | Car Tire Burst And Accident to School Bus in Kurnool | Sakshi
Sakshi News home page

టైర్‌ పేలి స్కూల్‌ బస్సును ఢీకొన్న కారు

Feb 20 2019 11:30 AM | Updated on Feb 20 2019 11:30 AM

Car Tire Burst And Accident to School Bus in Kurnool - Sakshi

ప్రమాదానికి గురైన స్కూల్‌ బస్సు

కర్నూలు  ,మంత్రాలయం రూరల్‌: టైర్‌ పేలడంతో అదుపు తప్పిన కారు..స్కూల్‌ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న విద్యార్థులకు సురక్షితంగా బయపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన  మంత్రాలయం మండల పరిధిలోని చెట్నేహళ్లి గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. మాధవరం వైపు నుంచి మంత్రాలయం వైపు వస్తున్న శ్రీవైష్ణవి పాఠశాలకు చెందిన స్కూల్‌ బస్సును మంత్రాలయం వైపు నుంచి మాధవరం వైపు వెళ్తున్న కారు టైరు పగిలి  ఢీకొట్టింది. స్కూల్‌ బస్సు చివరన కారు తాకడంతో పాక్షికంగా దెబ్బతింది. విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న పాఠశాల కరస్పాండెంట్‌ మల్లికార్జున, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు సత్యరాజు, నాయకులు అశోక్‌కుమార్‌ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను క్షేమంగా మరొక బస్సులో స్కూల్‌కు పంపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement