breaking news
Car tire bursting
-
కారు టైరు పేలి తల్లీకొడుకు దుర్మరణం
కావలిరూరల్: దైవదర్శనం చేసుకుని వస్తున్న ఆ కుటుంబంలో విషాదం నిండింది. కారు టైరు పేలిన ప్రమాదంలో తల్లీకొడుకు దుర్మరణం పాలయ్యారు. ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం అల్లిగుంటపాళెం క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం జరిగింది. కావలి రూరల్ ఎస్ఐ వెంకటరావు తెలిపిన మేరకు.. విశాఖపట్నం జిల్లాలో పరవాడ మండలం బర్నికంలోని వైజయంతి గార్డెన్స్‌లో ఎస్టీబీఎల్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని ప్లాట్ నంబరు 30లో బొంగరాల ఉదయకిరణ్ కుటుంబం నివాసం ఉంటుంది. ఆ కుటుంబానికి చెందిన పదిమంది కారులో తిరుమల వెళ్లారు. శనివారం స్వామిదర్శనం చేసుకుని ఆదివారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. నెల్లూరు వద్ద టిఫిన్ చేశారు. కావలి వద్దకు వచ్చేసరికి కారు టైర్ పగిలి అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని సుమారు 40 మీటర్ల దూరం వరకు వెళ్లి బోల్తాపడింది. కారు నడుపుతున్న ఉదయకిరణ్ (38), ముందు సీట్లో కూర్చున్న అతడి తల్లి బొంగరాల వేణమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉదయకిరణ్ భార్య ధనలక్ష్మి, సోదరుడు బొంగరాల మణికంఠ, అతడి భార్య సౌజన్య, మరో సోదరుడు సూర్యకిరణ్, అతడి భార్య అనూష గాయపడ్డారు. పిల్లలు తన్వి, వివిన్, సుశాంక్ సురక్షితంగా ఉన్నారు. వారిలో ఒకరు ఫోన్ చేయడంతో 108 వాహనం వచ్చింది. స్థానికుల సహాయంతో గాయపడినవారిని కావలి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయ్‌కిరణ్ సోలార్ కంపెనీలో సర్వీస్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. -
టైర్ పేలి స్కూల్ బస్సును ఢీకొన్న కారు
కర్నూలు ,మంత్రాలయం రూరల్: టైర్ పేలడంతో అదుపు తప్పిన కారు..స్కూల్ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న విద్యార్థులకు సురక్షితంగా బయపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మంత్రాలయం మండల పరిధిలోని చెట్నేహళ్లి గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. మాధవరం వైపు నుంచి మంత్రాలయం వైపు వస్తున్న శ్రీవైష్ణవి పాఠశాలకు చెందిన స్కూల్ బస్సును మంత్రాలయం వైపు నుంచి మాధవరం వైపు వెళ్తున్న కారు టైరు పగిలి ఢీకొట్టింది. స్కూల్ బస్సు చివరన కారు తాకడంతో పాక్షికంగా దెబ్బతింది. విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న పాఠశాల కరస్పాండెంట్ మల్లికార్జున, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు సత్యరాజు, నాయకులు అశోక్‌కుమార్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను క్షేమంగా మరొక బస్సులో స్కూల్‌కు పంపారు. -
కారు టైర్ పగిలి..
నార్కట్‌పల్లి, న్యూస్‌లైన్ :నార్కట్‌పల్లి మండలం ఏపీలింగోటం గ్రామ శివారులో ఓసీటీఎల్ కంపెనీ ఎదురుగా జాతీయ రహదారిపై గవర్నర్ జాయింట్ సెక్రటరీ కారు టైర్ పగిలిపోవడంతో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి అడ్డం తిరిగింది. ఈ ప్రమాదంలో గవర్నర్ జాయింట్ సెక్రటరీ బసంత్‌కుమార్‌కు తీవ్రగాయాలు కాగా, ఆయన కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. కారు అతివేగంతోపాటు రోడ్డుపై ఇనుప వస్తువు లాంటిది తగలడంతో టైరు పగిలిపోయినట్టు పోలీసులు గుర్తించారు. స్థానిక కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బసంత్‌కుమార్‌ను గవర్నర్ నరసింహన్ పరామర్శించారు. గవర్నర్ రాకతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కార్యాలయంలో ముఖ్యమైన పని ఉన్నదని.. రాజ్‌భవన్‌లో గవర్నర్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న పట్నాల బసంత్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో, సోదరులు ముగ్గురు.. వారి వారి కుటుంబ సభ్యులతో వేర్వేరు కారుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తెల్లవారుజామున బయలుదేరారు. బసంత్‌కుమార్‌కు కార్యాలయంలో ముఖ్యమైన పనిఉందని చెప్పి, సోదరుల కంటే అర్ధగంట ముందుగానే తన వ్యాగనార్ కారు (ఏపీ11ఏకే9779)లో బయలుదేరారు. డ్రైవింగ్ ఆయనే చేస్తున్నారు. కారులో భార్య అనిత, కుమారుడు అభినవ్, కుమార్తె బెనితిలు ఉన్నారు. కారు ఓసీటీఎల్ కంపెనీ వద్దకు రాగానే వెనుకటైర్ ఒక్కసారిగా పెద్దశబ్ధంతో పేలి పోయింది. అప్పటికే వేగం మీద ఉన్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి తిరిగి విజయవాడ రోడ్డు వైపు తిరిగింది. కారు ముందు అద్దాలు పగిలిపోయాయి. ఇంజిన్ ధ్వంసం కావడంతో ఆయిల్ మొత్తం రోడ్డుపై కారిపోయింది. డ్రైవింగ్ సీటు వైపు భాగం ధ్వంసమైంది. పగిలిపోయిన వెనుకచక్రం పూర్తిగా కారునుంచి విడిపోయింది. ఈ ప్రమాదంలో బసంత్‌కుమార్ తలకు బలమైన గాయాలు కాగా కుమారుడు అభినవ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. భార్య, కుమార్తెకు ఏమీ కాలేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కామినేని ఆస్పత్రి వారు వెంటనే తమ అంబులెన్స్‌తో సంఘటన స్థలానికి చేరుకుని వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిం చారు. అంతకుముందే స్థానిక ఎస్ఐ ప్రణీత్‌కుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని బసంత్‌కుమార్‌ను గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం . కాగా, సీఐ రాఘవరావు ఆదేశాల మేరకు ఎస్ఐ ప్రణీత్‌కుమార్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. తరలివచ్చిన జిల్లా అధికారులు గవర్నర్ జాయింట్ సెక్రటరీ బసంత్‌కుమార్‌కు ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న జిల్లా అధికారులు హుటాహుటిన కామినేని అస్పత్రికి తరలివచ్చారు. కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావు, ఏఎస్పీ రమారాజేశ్వరి, నల్లగొండ ఆర్డీవో జహీర్, భువనగిరి డిప్యూటీ డీఈఓ మదన్మోహన్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. బసంత్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నారు. వీరి వెంట నార్కట్‌పల్లి డిప్యూటీ తహసీల్దార్ విజయ్‌కుమార్, సీఐ రాఘవరావు, ఎస్ఐ ప్రణీత్‌కుమార్, చెర్వుగట్టు ఎంపీటీసీ సభ్యుడు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచ్ రమణబాలకృష్ణ, ఆర్ఐ నాగేందర్, వీఆర్ఓ బజూరి యాదయ్య ఉన్నారు.